భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ సూచించారు. “సురక్షా కా తిరంగా” కార్యక్రమంలో భాగంగా భువనగిరి డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి పోలీసులు భువనగిరి పట్టణంలో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ సైబర్ భద్రత ప్రాధాన్యతను వివరించారు.
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు.…





