భారత్ సమాచార్, మెదక్:  అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి శివప్రసాద్ అనే యువకుడు డిజే బాక్స్ కొనుగోలుకు ఇటీవల రూ. 3.50లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చే మార్గం లేక మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.