భార‌త్ స‌మాచార్, మెదక్ : జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, కులవివక్ష ఘటనలను అరికట్టి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. సోమవారం నర్సాపూర్ పర్యటనకు వచ్చిన మంత్రిని మెదక్ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా కేవీపీఎస్ మెదక్ జిల్లా…