భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై 13 దరఖాస్తులు సమర్పించారు.

వివిధ సమస్యలపై వినతులు

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ నర్సింగరావు…