భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందించడమే లక్ష్యంగా రూపొందించబడిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని పలువురు నాయకులు అన్నారు. రాజ్యాంగం కల్పించిన విలువలను కాపాడుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యువజన సంఘం…






