భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ కోరారు. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గురువారం మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను…






