భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మండల కేంద్రం నెల్లికుదురులో కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక…