భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, అయితే వాళ్లకు వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కేవలం 20 సీట్లేనని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని, వాళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు.. అదొట్టి గ్యాస్.. మళ్లా గదే 20 సీట్లు.. వస్తాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని…