భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఓటు హక్కు పరిరక్షణ, భారత రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో – సంవిధాన్ రక్షక్ మార్చ్’లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని కోరారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా…