భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అవమానించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలమని, అయినప్పటికీ కనీస గౌరవం ఇవ్వకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని…