భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
సోమవారం మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 61 దరఖాస్తులు…





