భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఇనుగుర్తిలో కొనసాగుతోంది. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో బండారి పార్థసారథి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించి మొత్తం నాలుగు దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి మంచి వేదికగా నిలుస్తోందన్నారు.
17 శాఖల అధికారులు హాజరు: ప్రజావాణి కార్యక్రమానికి మండలానికి చెందిన మొత్తం 17 శాఖల అధికారులు హాజరైనట్లు ఎంపీడీవో తెలిపారు. ఒకే వేదికపై వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండటంతో ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో పార్థసారథి కోరారు. తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజావాణిలో అందజేసి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నా





