భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఐడీఏ బొల్లారానికి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె బేగంపేట నిఖిత అరుదైన ఘనత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలోని కెమిస్ట్రీ విభాగంలో ప్రతిభ కనబరిచి ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించారు. తన ప్రతిభతో ఉన్నత విద్యలో సత్తా చాటిన నిఖితకు పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి నిఖిత నివాసానికి వెళ్లి ఆమెను ఘనంగా సత్కరించారు. శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు.…





