భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భూ రీసర్వే మొదటి దశ పనులను వేగవంతం చేసి, ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైన సిబ్బంది, యంత్ర పరికరాలు, సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకొని నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.
భూ రీసర్వే పనుల పురోగతిని సమీక్షించేందుకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.…






