భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పుగూడెం గ్రామంలో గణనాథుడి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గుండగాని మహేందర్ ఇంటి ముందు ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసి, చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

కోలాటాలు, భజనలతో సందడి చేస్తూ, బాజా భజంత్రీల నడుమ గణనాథుడిని మండపం వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం గుండగాని మహేందర్ దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ…