భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి హైస్కూల్ విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ హాజరై విద్యార్థులకు పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. చెత్త ఉత్పత్తి అయ్యే ప్రదేశంలోనే వ్యర్థాలను వేర్వేరుగా విభజించేలా భారత ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని తెలిపారు. ఇందుకోసం నాలుగు రకాల డస్ట్‌బిన్లను వినియోగించాలని సూచించారు.

ఆకుపచ్చ రంగు డస్ట్‌బిన్‌లో తడి చెత్త,…