భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నాగులపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పోషణ మాసోత్సవాల్లో భాగంగా శనివారం న్యూట్రిషన్ ఫెయిర్ (పోషకాహార ప్రదర్శన) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారం ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో ముఖ్యంగా విద్యార్థులు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల సరైన బరువు పెరగకపోవడం, శారీరక బలహీనత, మానసిక అభివృద్ధిలో లోపాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. “ఆహారం ద్వారానే ఆరోగ్యం” అనే…