భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అయోధ్య సేన ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్వాల్ రమేష్ దంపతులు తమ కుమారుడు పృథ్వీరాజ్ జ్ఞాపకార్థం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేషు యాదవ్ హాజరయ్యారు. అలాగే కౌన్సిలర్లు, పుర ప్రముఖులు,…