భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగ చిన్నారుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. దివ్యాంగుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని దివ్యాంగుల భవిత కేంద్రాన్ని జూనియర్ సివిల్ జడ్జి…






