భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గణేష్ నిమజ్జన వేడుకలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ బీబీ కుతిజాతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తుమోల్ల దత్తాత్రి మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వేడుకలు విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో దాదాపు…




