భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫత్తేపురం గ్రామానికి చెందిన సండ్ర నితిన్‌ను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. నితిన్ నీట్‌లో 485 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 1655వ ర్యాంకు పొందడంతో సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది.
ఆర్థికంగా అండగా నిలిచిన గ్రామ పెద్దలు
నితిన్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా…






