భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, ప్రమాదాల్లో గాయపడినవారిని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

గ్రామ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులుకు కాలు…