భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం మీట్యా తండాలో జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు చేశారు. తండాలో విద్యుత్ వెలుగుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ లైట్‌ను ఏర్పాటు చేసినట్లు బీజేపీ జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో సోలార్ లైట్ ఏర్పాటు చేయాలని గతంలో హుస్సేన్ నాయక్‌ను కోరగా, ఆయన స్పందించి CFR నిధుల సహాయంతో సోలార్ లైట్ మంజూరు చేయించారని…