భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు హైస్కూల్‌లో 1985–86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నర్సింహులగూడెంలోని శ్రీ కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ బిజీ జీవితాలను పక్కన పెట్టి ఒకచోట చేరి, తాము విద్యాభ్యాసం చేసిన ఆలేరు హైస్కూల్ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు?…






