భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలోని శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడటం కలకలం రేపింది. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు స్వామివారికి సంబంధించిన విలువైన వెండి ఆభరణాలను అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు గుర్తించారు. మకర తోరణం, కిరీటం, పాదాలు తదితర వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. ప్రాథమికంగా సుమారు 4.5 కిలోల మేర వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఘటన వెలుగులోకి రావడంతో భక్తులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
…






