భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తరగతి గదిలో నిలబడి తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం అంత సులభమైన విషయం కాదని, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఎంత కష్టపడతారో స్వయంగా అనుభవించిన తర్వాతే అర్థమైందని స్వయం పాలన దినోత్సవంలో టీచర్లుగా వ్యవహరించిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక్కరోజు ఉపాధ్యాయుల బాధ్యతలు చేపట్టడంతో వారి పని తీరు, ఎదురయ్యే సవాళ్లు తెలిసివచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో ఉపాధ్యాయ వృత్తిపై తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత…