భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని నర్సింహుల గూడెం యుపిఎస్‌లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం కె. పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు, ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ విద్యార్థులు వేడుకల్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా హెచ్ఎం పద్మావతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తుకు వారే పునాది…