భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను, ఆయన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా నాయకులు, యువత స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు…





