భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల కష్టాల్లో భాగస్వామిగా ఉంటున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మంగళవారం శంకరంపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
విలేకరి తండ్రి మృతికి సంతాపం
శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన విలేకరి తాటికొండ సుధాకర్ తండ్రి కృష్ణ ఇటీవల మృతి చెందారు. విషయం…






