భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అక్కన్నపేట గ్రామానికి ప్రత్యేకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు మెదక్ జిల్లా సహకార అధికారి (డీసీఓ)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్, తోనిగండ్ల గ్రామాలు కలిపి ప్రత్యేక సొసైటీగా కొనసాగేవని, ప్రస్తుతం తమ సొసైటీని రామాయంపేట సొసైటీలో విలీనం చేశారని గ్రామస్తులు తెలిపారు.

గతంలో ఉన్న సొసైటీని పునరుద్ధరించాలి

తమ గ్రామానికి గతంలో ప్రత్యేకంగా ఉన్న పీఏసీఎస్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డీసీఓను కోరారు.…