భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని వావిలాల రెవెన్యూ గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో భూక్య మహేందర్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వావిలాల గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.
తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం
ఈ సందర్భంగా ఏవో మహేందర్ మాట్లాడుతూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా వినియోగించడం వల్ల కలిగే నష్టాలను రైతులకు…






