భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని అన్నారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన మార్గంలో…






