భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, సమానత్వం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీ గంజ్ ఆవరణలో ఉన్న బాపూజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా భైంసా మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ గంజ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని…