భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేసి, ఈజేహెచ్ఎస్ పథకాన్ని వర్తింపజేయాలని వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే-హెచ్143 యూనియన్ అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి జర్నలిస్టులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…