భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న రైస్ మిల్ నిర్మాణ పనులను నిలిపివేసి, ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ మండలంలోని చిన్ననాగారం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎర్రబెల్లిగూడెం–చిన్ననాగారం ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ సమీపంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు గుడాల లక్ష్మారెడ్డి, ఉడత సోమయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ గ్రామానికి కనీస దూరంలో రైస్ మిల్ నిర్మించాలనే నిబంధనలకు విరుద్ధంగా మిల్లు నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. మిల్లు నిర్మిస్తున్న ప్రాంతానికి…






