భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సామాజిక అంశాలపై తమ కవితల ద్వారా చైతన్యం కలిగిస్తున్న ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఆధునిక భావకవి శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులకు ఆంధ్రప్రదేశ్లో ఘన సన్మానం లభించింది. అమ్మాయిల వస్త్రధారణ, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, తల్లిదండ్రుల బాధ్యతలు వంటి అంశాలపై వారు రాసి వినిపించిన కవిత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు కవి దంపతులను ప్రశంసా పత్రాలు, మెమెంటోలతో సత్కరించారు.
శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో…






