భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 7 దరఖాస్తులు అందాయి.
ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సింగారపు కుమార్, స్థానిక తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన 28 మంది అధికారులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు…






