భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు ఆరోపించారు.
పంటలకు నీరందక ఇబ్బందులు
విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 12 గంటలు కూడా కరెంట్ సరఫరా కావడం లేదని, కొన్ని సందర్భాల్లో 6 నుంచి 8 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందడం…






