భారత్ సమాచార్, సిద్ధిపేట జిల్లా: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ ఓ కుటుంబాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగిన ప్రమాదంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో నగదు, బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన అక్కన్నపేట మండలం గుబ్బడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మెడబోయిన పోచయ్య కుటుంబం వ్యవసాయ పనుల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా…






