భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ MP కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ BRS పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, మాజీ AGP కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సరిహద్దుల్లో సేవలు అందించారని గుర్తుచేశారు.…