భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సంపూర్ణ పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని నెల్లికుదురు ఎమ్మెల్యే డా. మురళి నాయక్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ తొర్రూరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం తదితర అంశాలపై ఎమ్మెల్యే వివరించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల ఆహారం అందించడం ద్వారా…






