భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట మెడికల్ కళాశాలకు మరో మృతదేహాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అప్పగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మండల స్వర్ణకార సంఘం సహకారంతో మోత్కూరు పరమేశ్వర్ (60) పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేశారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పరమేశ్వర్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో పరమేశ్వర్ మృతి చెందారు. అనంతరం మృతుడి సోదరుడు ప్రభాకర్‌తో పాటు స్వర్ణకారుల…