భారత్ సమాచార్, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులు, కార్మికులతో కలిసి కవిత ఆందోళన చేపట్టారు. సింగరేణి సీఎండీ స్వయంగా వచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామని తెలిపారు.…