భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు మండల ప్రజలకు సూచించారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.
మండల కేంద్రంలోని ఇనుగుర్తి రైతు వేదికలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో తోట హరీష్ కలిసి మండలంలోని వివిధ…






