భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: విశ్వబ్రాహ్మణ కులవృత్తులు చేసుకుంటున్న 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని, నిరుపేద విశ్వబ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మడుపు స్వప్న ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా మడుపు స్వప్న మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ కులంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు చాలామంది ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను పలుమార్లు…