భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ గదులు అధ్వానంగా మారాయని, వాటిని మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఎం నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. బస్టాండ్‌లో మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు మూత్రశాలలు సక్రమంగా…






