భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లిన ఓ వృద్ధుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఘటన నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది.

ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన బండపల్లి నర్సయ్య (80) ఆరోగ్యం బాగాలేకపోవడంతో మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుని వస్తానని చెప్పి 2024 మార్చి 4న ఇంటి నుంచి వెళ్లాడు. అయితే అప్పటి నుంచి…