భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల పరిధిలోని దరిపల్లి గ్రామంలో గొర్రెల మందపై గుర్తుతెలియని కుక్కలు దాడి చేయడంతో ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగం బాలయ్య తన గొర్రెలను పాకలో ఉంచగా, రాత్రి సమయంలో కుక్కలు మందపై దాడి చేశాయి.
కుక్కల దాడిలో ఐదు గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతోకాలంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న తనకు ఈ ఘటనతో ఆర్థికంగా తీవ్ర నష్టం…






