భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు.
లక్ష్మాపూర్ స్టేజి నుంచి దంతపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. అలాగే రైతుల సౌకర్యార్థం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు…






