భారత్ సమాచార్, తెలంగాణ: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

కరీంనగర్ జోన్‌లో 3,533 ప్రత్యేక బస్సులు

కరీంనగర్ జోన్ పరిధిలో మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రీజియన్ల వారీగా ఆదిలాబాద్…